ప్రజాశక్తి-మొగల్తూరు : మొగల్తూరులోని పెనుమత్స రంగరాజా జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా వర్ధమాని రవిశంకర్ సర్కార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మత్స్య పూరిలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ బదిలీపై మొగల్తూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ప్రజాశక్తితో మాట్లాడారు. తాను చదువుకున్న పాఠశాలకే ప్రధాన ఉపాధ్యాయులుగా రావడం తనకి ఆనందంగా ఉందని ఆయన అన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పాఠశాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానన్నారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించిన ఎస్ వి ఆర్ మూర్తి రాజు పాలకొల్లు మండలం అరటి కట్లలోని జెడ్పి ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా రవిశంకర్ సర్కర్ ను పలువురు ప్రజాప్రతినిధులు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి అభినందనలు తెలిపారు.










