ప్రజాశక్తి-గుంతకల్లు ప్రాణాపాయస్థితిలోని మనిషికి రక్తదానంతో జీవంపోస్తున్న రక్తదాతలే నిజమైన దేవుళ్లు అని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ అన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, రెడ్‌డ్రాప్ రెహమాన్ మాట్లాడుతూ రక్తదానం చేయడాన్ని ఒక మహాయజ్ఞంగా భావించి రక్తదానం చేయడంలో ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి అన్నారు. ఆయన జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మెగాస్టార్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఎంతో ఉత్సాహంతో 70 మందికి పైగా రక్తదానం చేసి నవజీవన స్ఫూర్తి దాతలుగా నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు కురుబ పురుషోత్తం, కాపు సంక్షేమ సేన నాయకులు బుర్ర అఖిల్ రాయల్, కసాపురం వంశీ సీనియర్ నాయకులు పామయ్య, ఆటో రామకృష్ణ, అమర్, అనిల్‌కుమార్, సూర్యనారాయణ, చికెన్ మధు, మహేష్, ఐఓసీ శేఖర్, శ్రీనివాసులు, రామకృష్ణ, మెగా అభిమానులు, జనసైనికులు పాల్గొన్నారు.
రక్తదానం చేస్తున్న యువత, జనసేన నాయకులు










