Oct 27,2022 22:10

రక్తదానం.. ప్రాణదానంతో సమానం
అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ జగదీష్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పోలీసు క్వార్టర్స్‌ ఆవరణంలోని శ్వేద మహిళల బ్యారక్‌లో పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ పి.జగదీష్‌ ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజలు, పోలీసులు రక్త దానం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా అంతటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. చిత్తూరులో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ల పర్యవేక్షణలో పోలీసు శ్వేద మహిళల బ్యారక్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అమరవీరుల స్పూర్తితో రక్తదాన శిబిరానికి తరలివచ్చిన విద్యార్థులు, ప్రజలకు వీరితో పాటు అడిషనల్‌ ఎస్పి అడ్మిన్‌ పి.జగదీష్‌ రక్తదానం చేసి, రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రతేకంగా అభినందిస్తూ ప్రశంసించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి ఆపరేషన్స్‌ శ్రీనివాస రావు, చిత్తూరు డిఎస్‌పి ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ డిఎస్పి తిప్పేస్వామి, ఎస్‌బి డిఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏఆర్‌ డిఎస్‌పి లక్ష్మి నారాయణ రెడ్డి, ఆర్‌ఐలు నీలకంటేశ్వర రెడ్డి, మధు, చిత్తూరు 1వ పట్టణ ఇన్స్పెక్టర్‌ నరసింహ రాజు, 2వ పట్టణ ఇన్స్పెక్టర్‌ యతీంద్ర, వెస్ట్‌ ఇన్స్పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఈస్ట్‌ ఇన్స్పెక్టర్‌ మద్దయ్యా చారి, పోలీసు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఉదయ కుమార్‌, పోలీస్‌ వెల్ఫేర్‌ హాస్పిటల్‌ డాక్టర్స్‌, పట్టణ ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.