Jun 23,2023 10:46

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో శుక్రవారం ఉదయం భారీ వర్షం దంచి కొట్టింది.2 గంటల వ్యవధిలో 87.4 మిమీ వర్షపాతం నమోదైంది. దాదాపు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ, బ్రాడీపేట, చింతలతోట మొదలగు కాలనీల్లో డ్రైన్లు, రోడ్లు కలిసి పొంగిపొర్లుతున్నాయి. నరసాపురంలో 63.6 మిమీ, యలమంచిలి మండలం లో 40.2 మిమీ, వీరవాసరం లో 24 .3 మీ, పాలకోడేరులో 20.4 మిమీ ఆకివీడు మండలంలో 15 మిమీ వర్షపాతం నమోదైంది. సరాసరి 302.2 మిమీ వర్షపాతం నమోదైంది