Jun 08,2023 16:56
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుల్లాయి స్వామి దర్శనానికి వచ్చే భక్తులు...
  • వచ్చే నెలలోనే కుల్లాయి స్వామి మొహరం వేడుకలు ప్రారంభం... గ్రామంలో సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే...

ప్రజాశక్తి-నార్పల : మండల పరిధిలోని రాష్ట్రంలోనే మత సామరస్యానికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన గూగూడు కుల్లాయ స్వామి వెలిసిన గ్రామం గూగూడులో రాత్రి కురిసిన మోస్తారు వర్షానికి గ్రామంలోని ప్రధాన రహదారిలో మోకాళ్ళ లోతు వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గూగుడు కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి దర్శనానికి వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులు గూగూడు గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం పరిపాటిగా మారిపోయిందని దశాబ్దాల కాలం నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి. గానీ వచ్చిన ప్రతి నూతన ప్రజా ప్రతినిధులు, అధికారులు కుల్లాయ స్వామిని దర్శనం చేసుకోగానే పూనకం వచ్చిన విధంగా గూగూడు గ్రామ అభివృద్ధికి వరాలు ప్రకటించడం గ్రామ ప్రజలు తమ గ్రామ రూపు రేకులు మారిపోతాయని ఆశ పడడం హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు అధికారులు మళ్లీ బ్రహ్మోత్సవాల వరకు గూగూడు గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం జరుగుతోంది. ప్రతి ఏడాది కుళ్ళయా స్వామి బ్రహ్మోత్సవాల ద్వారా స్వామివారి ద్వారా దాదాపు రెండు కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా గూగూడు గోడు వినే వారే కరువయ్యారు దీంతో గ్రామ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది గతంలో కుల్లాయి స్వామి ఆలయ పరిసరాలు చుట్టూ ఉన్న భవనాలను తొలగించి అభివృద్ధి చేస్తామని ఆర్డిఓ స్థాయి అధికారులతో రెండు మూడు సార్లు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించడం తరువాత ఆ సమస్యను మరుగున వేయడం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలోనే కాక గురువారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారాల్లో గూగూడు గ్రామంలో భక్తులు భారీ ఎత్తున కుల్లాయి స్వామిని దర్శించుకుని కందూరులు చేస్తారు అని అన్నీ కాకపోయినా కనీసం కుళ్ళయా స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసమైనా గ్రామంలోని ప్రధాన రహదారి నైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని వేయించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.

జులై నెలలో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు - ప్రారంభం సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే..

జూలై మాసంలో కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పది రోజులు అంగరంగ వైభవంగా జరిగే  మొహరం వేడుకల సందర్భంగా కుల్లాయి స్వామి దర్శనానికి రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి లక్షలాదిగా భక్తులు భారీ ఎత్తున తరలివస్తారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందని చిన్నిపాటి వర్షానికే గూగుడు గ్రామ పరిస్థితి ఇలా ఉంటే భారీ ఎత్తున వర్షాలు పడితే సుదూర ప్రాంతాల నుండి కుల్లాయి స్వామి  దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు, పాలకులు, ఆలయ కార్యనిర్వాహక చైర్మన్, సభ్యులు కార్యనిర్వహణాధికారి అందరూ సమన్వయంతో వ్యవహరించి ఉన్నతాధికారులను ప్రజా ప్రతినిధులను బ్రహ్మోత్సవాలకు ముందే సంప్రదించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు అలా కాకుండా ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తే గత ఏడాది ఆలయ రంగుల విషయంలో గందరగోళం ఏర్పడి గ్రామస్తులు వర్గాలుగా విడిపోయి బ్రహ్మోత్సవాలు మొత్తం నివురు గప్పిన నిప్పులా పోలీసుల పరాహారా లో సాగాయి బ్రహ్మోత్సవాల్లో ఎప్పుడూ ఏ వివాదం జరుగుతుందోనని భక్తులు భయంగానే స్వామి వారిని దర్శనం చేసుకుని వెళ్లారు అలా కాకుండా అధికారులు పాలకులు బేసజాలకు పోకుండా స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా గ్రామస్తులందరుని కలుపుకొని ముందస్తుగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని కుళ్లాయి స్వామి మొహరం వేడుకలను విజయవంతం చేసి స్వామి కీర్తిని దేశవ్యాప్తంగా స్వామి దర్శనానికి వచ్చే భక్తుల హృదయాలలో నిలపాలని పలువురు కుల్లాయి స్వామి భక్తులు కోరుతున్నారు.