Jun 24,2023 13:13

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో శనివారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజల గొడుగు పట్టుకుని రోడ్ ఎక్కుతున్నారు. గత నెలరోజులపాటు ఎండ వేడిమి ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అయిన చిన్నారులు వృద్ధులు, ప్రజలకు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. విద్యార్థులు పాఠ్యపుస్తకాల  బ్యాగ్ లు చేతపట్టి హుషారుగా పాఠశాలకు వెళ్తున్నారు. ఈ వర్షానికి రహదారులు అద్వానంగా తయారయ్యాయి.  కాగా వర్షాలు రాకతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు.