Mar 19,2023 17:14

ప్రజాశక్తి-పెనుకొండ :  మండలంలో కురిసిన వడగళ్ళ వానకు దుద్దేబండ, ఎర్రమంచి, రాంపురం, గుట్టూరు, మునిమడుగు, వెంకటగిరిపాళ్యం రైతు భరోసా కేంద్రాల పరిధిలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి సురేంద్ర నాయక్ ఆదివారం పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా  రైతు భరోసా కేంద్రాల పరిధిలో 131 మంది రైతులకు సంబంధించి 289 ఎకరాలలో మొక్కజొన్న పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించి  పై అధికారులకు నివేదిక పంపడం జరిగిందన్నారు. రేపటినుండి ఆయా సంబంధిత రైతుభరోసా కేంద్రాల సిబ్బంది పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో సంప్రదించవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో వ్వవసాయ విస్తరణాధికారి అశోక్ కుమార్,రైతు భరోసా కేంద్రాల  సిబ్బంది, శ్రీకాంత్ రెడ్డి, రైతులు  పాల్గొన్నారు.