Sep 13,2023 22:07

యంత్రాన్ని పరికరాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: రిమ్స్‌ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో కంప్యూటర్‌ అసిస్టెడ్‌ రేడియో మోనిటరింగ్‌ యంత్రం (కార్మ్‌) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యంత్రాన్ని అర్ధోపెడిక్‌ విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ టి.శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఎముకలు విరిగిన ప్రదేశంలో సూక్ష్మమైన శస్త్రచికిత్సల అవసరాన్ని గుర్తించేందుకు ఈ యంత్రాన్ని వినియోగించనున్నట్టు తెలిపారు. రోగులు ఇకపై ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్‌ఎంఒ డాక్టర్‌ ఎల్‌.ప్రసన్న కుమార్‌, కె.శ్రీనివాసరావు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.