రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి : కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: టిడ్కో గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ అధికారులను ఆదేశించారు. టిడ్కో గహాల రిజిస్ట్రేషన్, రుణాలమంజూరు అంశాలపై బుధవారం నగరపాలక కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 300 చదరపు అడుగుల గహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. ఇదే సమయంలో మతిచెందిన 36 మంది లబ్ధిదారుల స్థానంలో వారి వారసుల పేర్లు నమోదుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. చిరునామా సరిపోవాలని వారికి సంబంధించి ఇప్పటికే వివిధ ప్రకటనల ద్వారా ప్రచారం కల్పించామని, అలాంటి వారి నుంచి వినతిపత్రాలు వస్తే రికార్డులు పరిశీలించి సత్వరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించాలన్నారు. 365, 430 చదరపు అడుగుల గహాలకు సంబంధించి రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏసీపీ రామకష్ణుడు, మెప్మా సిఎంఎం గోపి, టిడ్కో కన్సల్టెంట్ ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.










