Oct 15,2023 22:22

ఫొటో : రీ సర్వే చేపడుతున్న అధికారులు

రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం
ప్రజాశక్తి-సీతారామపురం : రీ సర్వేలో ప్రజల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తహశీల్దార్‌ ఎం.వి.సుధాకర్‌రావు తెలిపారు. ఆదివారం మండలంలోని నారాయణమ్మపేట రెవెన్యూ పరిధిలో భూ సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్వేయర్‌ శ్రీకాంత్‌, విఆర్‌ఒ మనోహర్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.