రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం
ప్రజాశక్తి-సీతారామపురం : జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న భూ సర్వేతో గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు, రైతుల మధ్య తగాదాలు పరిష్కారం అవుతాయని తహశీల్దార్ ఎం వి కె సుధాకర్ బాబు తెలిపారు. ఆదివారం సీతారామపురం మండలంలోని నారాయణమ్మపేట రెవెన్యూ పరిధిలో జగనన్న భూ రక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని రైతుల మధ్య తగాదాలు లేకుండా భూసర్వే ఎంతో ఉపయోగపడుతుందని రైతులు వారి వద్ద ఉన్న ఆధారాలతో భూ సర్వే కార్యక్రమంలో అధికారులకు చూపిస్తే వాటిని పరిశీలించి రైతులకు హద్దులను కొలతలను వేసి త్వరలో భూహక్కు పత్రాలను అందజేస్తామని అందువల్ల గ్రామాలలో రైతుల మధ్య వివాదాలు లేకుండా ఉంటాయన్నారు. కాబట్టి రైతులు రెవెన్యూ సిబ్బందికి సహకరించి భూ సర్వేలో పాల్గొని లబ్ధి పొందాలని ఆయన కోరారు.










