Oct 20,2022 08:41

ప్రజాశక్తి-వెదురుకుప్పం( చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు  నియోజకవర్గం వెదురు కుప్పం మండలం బలిజ మొండి వెంగనపల్లి గ్రామానికి చెందిన పోటుగారి భాస్కర్ పిసిసి మెంబర్ గా  నియమితులయ్యారు. కాంగ్రెస్  నాయకత్వం జూడో పాదయాత్రను ప్రారంభించింది . ఈ పాదయాత్రలో గురువారం రాహుల్ గాంధీ తో కలిసి ఈ పాదయాత్ర లో  పాల్గొన్నారు. భాస్కర్ కి  కాలికి  గాయాం అయ్యింది. పరిశీలించి,  రాహుల్ గాంధీ స్వయంగా అంబులెన్సు ను పిలిపించి ఎక్కించారు. రాహుల్ గాంధీ గ మానవత్వం ఏ పాటిదో నేనే స్వయంగా  అనుభవించినందుకు గర్వపడుతున్నాను. అని తను పాత్రికేయులకు చెప్పారు. అక్కడ ఉన్న కాంగ్రెస్ కేటర్ ఆయన  మంచి మనసును అభినందించారు.