Jul 12,2023 21:21

ప్రజాశక్తి - పెనుమంట్ర
            గోతులతో అధ్వానంగా ఉన్న పొలమూరు రహదా రిని నిర్మించాలని ప్రజలు, వాహనదారులు ముక్తకంఠంతో కోరు తున్నారు. వారం రోజుల్లో రహదారి నిర్మాణ పనులు ప్రారం భిస్తామని ఆర్‌అండ్‌బి ఎఇ యశ్వంత్‌ గతంలో చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని వాహదారు లు విమర్శిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజలు, వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15 తేదీన పొలమూరులో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఆ కార్యక్రమంలో రహదారి విస్తరణ, డ్రెయినేజీ వ్యవస్థ ఇలా స్థానికంగా పలు సమస్యల గురించి తీవ్రంగా చర్చంచే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. రహదారి విషయంపై కార్యక్రమంలో స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు.