ప్రజాశక్తి-వెదురుకుప్పం:
అయితే ఒక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత రెవెన్యూ సమస్యలను తుంగలో తొక్కారని ద్వజమెత్తారు. జనసేన పార్టీ రైతులకు అండగా ఉండి వెదురుకుప్పం మండలంలో జరిగిన రెవెన్యూ అవకతవకలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్‌డివోల దృష్టికి తీసుకెళ్లెలా కార్యచరణ చేస్తామన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మండల తాహశీల్దార్ ఆఫీస్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. గత 20 సంవత్సరాలుగా రైతుల గోడు పట్టించుకోవడంలేదని ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేక పోతోందన్నారు. మండలాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ సమస్యలపై డిప్యూటి తాహశీల్ధార్ కోమలికి వినతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, మండల ప్రధాన కార్యదర్శి సతీష్, జనసేన సీనియర్ నాయకులు ఈశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవా, ఐటీసెల్ సురేంద్రరెడ్డి, వివిధ పంచాయతీల రైతులు పాల్గొన్నారు.










