మాట్లాడుతున్న కమిషనర్
రెవెన్యూ వసూళ్లపై దష్టి సారించాలి...
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి, కుళాయి, డ్రెయినేజీ , కమర్షియల్ భవనాల బకాయిల పన్నుల వసూళ్లపై దష్టి సారించి సచివాలయాలకు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతం చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ అడ్మిన్ కార్యదర్శులకు ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిన్ కార్యదర్శులు అందరూ ఆరోగ్యశ్రీ యాప్‌ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకొని ఉచిత వైద్య సేవలకు అర్హులందరికీ అందించేందుకు కషి చేయాలన్నారు. జగనన్నకు చెబుదాం ద్వారా అందుకున్న ఫిర్యాదులకు ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారాలను అందించి బాధితులకు అండగా నిలచాలన్నారు. ఉచిత వైద్య సేవలు, పరీక్షలు, మందులను అందించేందుకు అన్ని ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని అందుకొని కార్పొరేషన్ ఆదాయం పెంచి అభివద్ధికి బాటలు వేసేందుకు సమిష్టిగా కషి చేయాలన్నారు.కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కమీషనర్ శర్మద, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు టీపిఆర్‌ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










