Jan 20,2023 20:50

రెండు పంచాయతీల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి- గంగాధరనెల్లూరు:
గంగాధర నెల్లూరు, కలిజవేడు పంచాయతీల్లో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ శుక్రవారం సాయంత్రం ఆకస్మిక పర్యటనలు చేశారు. గంగాధర నెల్లూరు పంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న జగనన్న లేఅవుట్‌ను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూల్‌ని తనిఖీ చేసి విద్యార్థుల నుంచి పాఠ్యాంశాలపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కలిజవేడు పంచాయతీ పరిధిలోని వెంకటాపురం దళితవాడలో అంగన్వాడి కేంద్రం, కలిజవేడు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచ్‌ నీలావతి తమ పంచాయతీ పరిధిలో వెంకటాపురం రోడ్డు, బొమ్మవారిపల్లి రోడ్డు మరమ్మతులకు గురి అయ్యాయని నిరంతరం వాహనదారులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్‌ దష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదేవి, తహశీల్దార్‌ ఇన్బనాధన్‌, సీడీపీవో వినతశ్రీ, రాష్ట్ర గ్రీన్‌ బ్యూటీ ఫికేషన్‌ డైరెక్టర్‌ గుణారెడ్డి, వైఎస్సార్టీయుసి ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు సుబ్రమణ్యం రెడ్డి, కలిజవేడు సర్పంచ్‌ నీలావతి, వైస్‌ఎంపీపీ హరిబాబు, సచివాలయం అధికారులు పాల్గొన్నారు.