ప్రజాశక్తి - శాంతిపురం / కార్వేటినగరం
శాంతిపురం మండలంలోని పలు స్కూళ్లలో రెండో రోజూ సాంకేతిక కారణాల వల్ల స్కూల్ అటెండెన్స్ యాప్ పనిచేయలేదు. దీంతో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉదయం 8.30 గంటలకు ముందే పాఠశాలకు చేరుకుని ఆన్‌లైన్ అటెండెన్స్ వేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నామని, సర్వర్ బిజీ, లాగిన్ ఫెయిల్ డ్యూటూ సర్వర్ ఇష్యూ, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్ అని వస్తుండడంతో ఉపాధ్యాయులు నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బయోమెట్రిక్ విధానం బాగా పనిచేసేదని, పాత విధానాన్నే కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కార్వేటినగరంలో ఉపాధ్యాయులు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఎంఇఒ విజరుకుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ ఫేస్ అటెండెన్స్ యాప్‌ను రద్దు చేయాలని కోరారు.










