May 11,2023 21:59

నిరసన తెలియజేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

        ప్రజాశక్తి-తాడిపత్రి   ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరు గుతున్న రెజ్లర్ల న్యాయ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజరామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి.రంగయ్య, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామమూర్తి పిలుపునిచ్చా రు. రెజ్లర్ల పోరాటానికి మద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం తాడిపత్రిలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం తరపున ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించినప్పుడు వారిని చూసి గర్వ పడ్డామన్నారు. అలాంటి వారు వేధింపులకు గురైన ప్పుడు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పగలు, రాత్రి అక్కడే అక్కడే పడుకుని క్రీడాకారులు నిరసనలు తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమ న్నారు. వెంటనే క్రీడాకారులను వేధించిన భారతీయ రెజ్లర్ల రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఆదినారా యణ, ప్రజా కళామండలి పిఎం విజరు, జిల్లా సెక్ర టరీ ప్రగతిశీల, కార్మిక సమైక్య బిసి రామప్ప, సిఐటి యు జిల్లా సహాయ కార్యదర్శి ఉమాగౌడ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి వెంకట్‌, ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ ఫెడరేషన్‌ సిఐటియు పట్టణ కార్యదర్శి టి.రవికుమార్‌, రామాంజి, సాదక్‌వలి, తదితరులు పాల్గొన్నారు.