రాష్ట్ర సదస్సులో పుష్పరాజ్ దేశముఖ్ వెల్లడి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, నిత్యావసర సరుకులు వాహనాల ద్వారా కాకుండా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజలకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ ఫెయిర్ ప్రైస్ షాప్ రేషన్ డీలర్ వెల్ఫేర్ ఫెడరేషన్ జాతీయ నాయకులు పుష్ప రాజు దేశ్‌ముఖ్ తెలిపారు గురువారం రాష్ట్రస్థాయి రేషన్ డీలర్ల ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సును సిపిఐ కార్యాలయంలోని గంథమనేని శివయ్య భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో నిత్యావసర సరుకుల పంపిణీ రేషన్ డీలర్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయకుండా వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారని, దీనివల్ల రేషన్ డీలర్లు వీధిన పడ్డారని పేర్కొన్నారు. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు రేషన్ డీలర్లకు కమిషన్ 300 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి బియ్యం బస్తా పై 50 కేజీలు అన్నట్టు ఉండాలని ఖచ్చితమైన తూకం వేసి పంపిణీ చేయాలన్నారు ఇతర నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు ఈపాస్ మిషన్ ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. డీలర్లకు ఇన్సూరెన్స్ అమలు చేయాలని పేర్కొన్నారు గన్ని సంచులు ధర 30 రూపాయలకు పెంచాలని తెలిపారు. ముద్ర లోన్ నాలుగు లక్షల రూపాయలకు పెంచాలని కోరారు. కారుణ్య నియామకాలు 50 సంవత్సరాలు పెంచాలని ప్రభుత్వానికి తెలియజేశారు. తమ సహనాన్ని పరీక్షించిన యెడల వచ్చే నెల నాలుగో తేదీ కోర్టు దష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సదస్సులో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ బిశ్వం భర బస్సు, జాతీయ కోశాధికారి కే కష్ణమూర్తి నాయి కోటి రాజు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి శ్వర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, తిరుపతి డివిజన్ అధ్యక్షులు జయరామ్ నాయుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డీలర్లు పాల్గొన్నారు.










