
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈనెల 20న నగరంలోని నెహ్రూ యువ కేంద్రంలో జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ ఒక ప్రకటనలో తెలిపారు. 2050 హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యాన బిఎస్‌సి నర్సింగ్, హోంకేర్ నర్సింగ్‌కు జిఎన్‌ఎం, ఎఎన్‌ఎం నర్సింగ్ సహాయకులుగా ఎంపిహెచ్‌డబ్ల్యు కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం ఉందని తెలిపారు. విశాఖ, హైదరాబాద్ కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని, జీతం పలు కేటగిరీల ఆధారంగా చెల్లించనున్నట్లు తెలిపారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల కోసం డిగ్రీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వీరు జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు తమ విద్యార్హతలు, ఉద్యోగ అనుభవ వివరాలను ఔఔఔ.చీజూ.+ఉV.×చీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికేట్లు, ఆధార్ కార్డుతో ఆరోజు ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలని తెలిపారు.