
మాట్లాడుతున్న సూర్యారావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం లీగల్ : జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, పాతపట్నం, కొత్తూరు, పొందూరు, రాజాం బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో ఈనెల 18వ తేదీన ఉదయం పది గంటలకు జిల్లా బార్ అసోసియేషన్ భవనంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎన్ని సూర్యారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పిటిషన్‌పై రూపాయి స్టాంపుతో పాటు అదనంగా మరో రూ.20 వెల్ఫేర్ స్టాంపు అతికించాలని బార్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. సంక్షేమ నిధి స్టాంప్ రుసుము పెంపును న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం న్యాయవాదులకు చెల్లిస్తున్న సంక్షేమ నిధిని రూ.నాలుగు లక్షలను రూ.20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.