Oct 12,2023 21:25

రేపట్నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

ప్రజాశక్తి - టెక్కలి: ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలకు ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విద్యా సంవత్సరం అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఈ ఏడాది 11 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. ఈనెల 25వ తేదీన తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈసారి ఎఫ్‌ఎ-2 పరీక్షల అనంతరం దసరా సెలవులు ఇచ్చారు. నవంబరులో ఎస్‌ఎ-1 పరీక్షలను నిర్వహించనున్నారు.