Oct 28,2023 23:45

చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న ఎకె ఫరీడా, తదితరులు

* రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఎ.కె ఫరీడా
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : 
దేశంలోనే సేవా గుణం, మనవతా దృక్పథం కలిగిన సంస్థ రెడ్‌క్రాస్‌ సొసైటీ అని రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ ఎ.కె.ఫరీడా అన్నారు. నగరంలోని అంబేద్కర్‌ కళావేదికలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌లో ప్రతిఒక్కరూ సభ్యులుగా చేరాలని సూచించారు. రాష్ట్రంలో లక్షా యాభైవేల మంది ఎన్‌సిసి క్యాడిట్లు రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేశారని అన్నారు. అత్యధక సభ్యత్వం కలిగిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సొసైటీ ఒక మిలియన్‌ యూత్‌ రెడ్‌క్రాస్‌ వాలంటీర్లు నమోదు కాడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. వాలంటీర్ల నమోదు కోసం రూపొందించిన ష్ట్ర్‌్‌జూ//.ఱతీషరరసశ్రీ.స్త్రశీఙ.ఱఅ అనే వెబ్‌ సైట్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ లక్షణాలను, పనితీరును ఆయన వివరించారు. యువతకు చదువు, నైపుణ్యంతో పాటు మానవత్వం ఉంటేనే గుర్తింపు ఉంటుందన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద మొత్తంలో యూత్‌ రెడ్‌క్రాస్‌ వాలంటీర్ల ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీలో నమోదు కావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జెఆర్‌సి/వైఆర్‌సి ఒన్‌ మిలియన్‌ వాలంటీర్ల నమోదు కార్యక్రమం శ్రీకాకుళంలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఏటా రెడ్‌క్రాస్‌ శ్రీకాకుళం జిల్లా శాఖ రాష్ట్రస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ప్రతి మండలం, స్కూళ్లు, కాలేజీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముందుగా జాన్‌ హెన్డ్రీ జునంట్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీన, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ చైర్మన్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు, ట్రేజరర్‌ సిహెచ్‌.వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కె.సుధీర్‌, కె.దుర్గాశ్రీనివాస్‌, నిక్కు అప్పన్న, నిక్కు హరిప్రసాద్‌, కళ్యాణచక్రవర్తి, నూక సన్యాసిరావు పాల్గొన్నారు.