ప్రజాశక్తి-నెల్లూరు : ఇండియన్ రెడ్ క్రాస్ సొసౌటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ పొదలకూరు రోడ్డులోని కేన్సర్ హాస్పిటల్ నూతన భవనానికి రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ కన్వీనర్ ఎం.వి. సుబ్బారెడ్డి (నేతాజీ సుబ్బారెడ్డి) తల్లి తండ్రులు కీ.శే. ఎం. వి. వెంకట రెడ్డి, కీ.శే. ఎం. వి. లక్ష్మమ జ్ఞాపకార్ధం రూ.2 లక్షలచెక్ ను ఛైర్మన్ పి. చంద్ర శేఖర్ రెడ్డి సమక్షంలో క్యాన్సర్ హాస్పిటల్ కన్వీనర్ ఎంవి .జుబైర్ కి అందించారు. రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు , బ్లడ్ సెంటర్ కొ-కన్వీనర్ వాకటి విజయకుమార్ రెడ్డి, రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ కో-కన్వీనర్ యన్. బలరామ నాయుడు, క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ ఎం. నాగేశ్వర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.లక్ష్మి, సెక్రెటరీ పి. మస్తానయ్య పాల్గొన్నారు.










