ప్రజాశక్తి-పుత్తూరు టౌన్ : పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ ముఖ్య కార్యకర్తలు కలసి మంగళవారం కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకాలను విడుదల చేశారు ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకదాని తర్వాత మరొకటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని, దోపిడి అంతమై జాతి విముక్తి కలగడానికి కమ్యూనిస్టు పరిష్కారమని అన్నారు. వర్గ పోరాటమే మార్గమని పేర్కొన్నారు. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక విడుదల చేసిన ఫిబ్రవరి 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రెడ్ బుక్స్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. కమ్యూనిస్టు ప్రణాళిక 174 వార్షికోత్సవ ప్రపంచంలో దేశంలో పెట్టుబడిదారి విధానాలు, పరిణామాలు ఏవిధంగా ఉంటాయో 1848లో మార్క్స్ ఎంగెల్స్ పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం మతోన్మాదానికి ప్రేరేపిస్తూ మోడీ బలపరచడానికి చూస్తున్నారని, కార్మిక, కర్షక వర్గ పోరాటాలతో ప్రతిఘటన పెరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ.విజరు, భాస్కర్, సుబ్రహ్మణ్యం పిళ్లై, రమేష్, శివ పాల్గొన్నారు.










