Sep 26,2023 21:56

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌ ఆథోని

           ప్రజాశక్తి-అనంతపురం   రాబోవు దసరా పండగ సమయంలో ప్రయాణికుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను జత పరచడం, కుదించుకోవడం చేయాలని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుమంత్‌ ఆర్‌ ఆథోని సూచించారు. మంగళవారం నగరంలోని రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో జిల్లాలోని డిపో మేనేజర్లు, డిపో ట్రాఫిక్‌ ఇన్‌ఛార్జిలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రద్దీ సమయంలో ఏ ప్రయాణికునికీ ఇబ్బంది తలెత్తకుండా ఆదాయం గడించాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిటిఎం రమేష్‌బాబు, డిప్యూటీ సిఎంఇ మోహన్‌కుమార్‌, డిపో మేనేజర్లు నాగభూపాల్‌, శంకర్‌, రామచంద్ర, సురేష్‌కుమార్‌, నారాయణస్వామి, ట్రాఫిక్‌ ఇన్‌ఛార్జిలు వినరుకుమార్‌, రమణమ్మ, ప్రసాద్‌, ఆర్‌ఎం ఆఫీస్‌ ఎస్‌టిఐ నాగర్జున, ఎఎంఎఫ్‌ సాయిప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.