ప్రజాశక్తి-చిన్నగొట్టిగల్లు (చిత్తూరు) : స్థానిక భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు రచయిత్రి ధనాశి ఉషారాణి లెజెండ్ సేవా పురస్కారాన్ని అందుకొన్నారు. అనేక నూతన ప్రక్రియలల్లో రచనలు చేస్తూ రూపొందిస్తూ రేడియో, టివిల్లో కవితా హస్త్రాలను సంధిస్తూ నేటి సమాజానికి ప్రేరణ కలిగిస్తూ పుస్తకాలను ముద్రిస్తూ ఉన్న నేపథ్యంలో... ఆదరణ వెల్ఫేర్ సొసైటీ ఐఎస్‌ఒ గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురంవారు మార్చి 20 వ తేదీన ఆంధ్ర లెజెండ్ సేవా పురస్కారాన్ని ఆ సంస్థ అధ్యక్షులు గొంటుముక్కల చెన్నకేశవులు అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ప్రకటించారు. ఇప్పటికి పదుల సంఖ్యలో పుస్తకాలు ముద్రించి 60 అవార్డులు 20 బిరుదులు అనేక రికార్డులు పొంది అనేక సేవా సంస్థల్లో అధ్యక్షురాలిగా కీలక పదవులను నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర లెజెండ్ సేవా పురస్కారాన్ని అందుకోవడం అందరికీ ఆదర్శమని తోటి కవులు, ఉపాధ్యాయులు, స్థానికులు అభినందనలు తెలిపారు.










