Dec 04,2022 22:36

కందుకూరి నవలా పురస్కారం అందుకుంటున్న రచయిత్రి అరుణకుమారి


రచయిత్రి అరుణకు కందుకూరి నవలా పురస్కారం
ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌:
కవిత, విద్యా సాంస్కతిక సేవా సంస్థ కడప వారు 2010లో స్థాపించి విద్యా, సాంస్కతిక, సేవా, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఉత్తమ జాతీయ పురస్కారాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 2022వ సంవత్సరానికి గాను ఐదుగురు మహిళలకు వివిధ విభాగాలలో పురస్కారం ప్రదానం చేశారు. చిత్తూరుకు చెందిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి యంఆర్‌ అరుణ కుమారి రాసిన 'కన్నీటి చేవ్రాలు' నవలకు కందుకూరి నవలా పురస్కారం లభించింది. ఈ నవలా పురస్కారాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు విజయవాడలోని గాంధీ రోడ్డులోని ఎన్జీవో హోంలో పురస్కార సభ జరిగినది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మా ముఖ్యఅతిథిగా హాజరై సంస్థ చేస్తున్న విశిష్ట సేవలను అభినందించారు. మహిళలు అన్ని రంగాలలో తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తున్నారని, వర్తమాన సమాజంలో మహిళలను మరింత చైతన్యపరిచే విధంగా రచనలు చేయాలని తెలిపారు. కందుకూరి నవలా జాతీయపురస్కారం పొందిన కవయిత్రి యం ఆర్‌ అరుణ కుమారిని సన్మాన పత్రం దశ్యాలువా, మాల, మెమెంటో తో పాటు 5000( ఐదు వేలు)నగదు బహుమతితో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ మరియు సంస్థ నిర్వాహకులచే ఘనంగా సత్కరించారు.