Jul 16,2023 21:09

విలేకరులతో మాట్లాడుతున్న ఎఫ్‌ఎసిఎస్‌ ఛైర్మన్‌ శ్రీరాములు, సిఇఒ ఎర్రిస్వామి

         ప్రజాశక్తి-ఉరవకొండ   రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని విడపనకల్‌ రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్‌ బోయ శ్రీరాములు, సిఇఒ ఎర్రిస్వామి తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడుతూ విడపనకల్లు మండలంలోని 12 గ్రామాలు, వజ్రకరూరు మండల ంలోని రెండు గ్రామాల్లో దాదాపు 2900 వందల మంది రైతులు సభ్యత్వాన్ని తీసుకున్నట్లు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న రైతులకు సహకారం అందించ డమే కాకుండా గ్రామాలలో పర్యటించి రైతుల సభ్యత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామన్నా రు. ఈ సొసైటీ పరిధిలో రైతులకు క్రాప్‌లోన్లతో పాటు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సభ్యత్వం ఉన్న రైతులందరికీ గరిష్టంగా రూ.3లక్ష వరకూ క్రాప్‌ లోన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర స్వల్పకాలిక రుణాలు గరిష్టంగా రూ.12 లక్షల వరకూ 9.65 శాతం వడ్డీ రేటుతో రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. అంతేగాకుండా దీర్ఘకాలిక రుణాల పరిధిలో డెయిరీ, గొర్రెల పెంపకం, ట్రాక్టర్‌, బోరు బావి, మోటార్‌ లాంటివాటికి ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల కాల పరిమితితో ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు అర్హతను బట్టి రుణాలు అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సేల్స్‌ మెన్నులు అబీబ్‌, కోటేశ్వరయ్య, ఈశ్వరప్ప, తదితరులు పాల్గొన్నారు.