May 09,2023 19:42

ప్రజాశక్తి - పెనుగొండ
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని , వాకిరి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.వెంకటేశ్వరరావు విమర్శించారు. సిపిఎం నేతలు మంగళవారం దేవ గ్రామంలో ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం క్వింటాకు అదనంగా 2.5 కేజీల తూకం ఇవ్వాలని హుకుం జారీ చేసిందని, నూక శాతం పేరుతో సంచితో 41 కేజీల నుండి 42 కేజీలకు ఒక కేజీని పెంచి పట్టుబడి పట్టాలని ఆదేశించిందని తెలిపారు. ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల దయాదాక్షిణ్యాలకే రైతులను వదిలేసిందన్నారు. అదనంగా క్వింటాల్‌కు 2.5 కేజీలు తూకాన్ని వ్యతిరేకిస్తూ రైతు భరోసా కేంద్రం వద్ద ఎంపిఇఒ కె.జ్యోతికి వినతిపత్రం సమర్పించారు.