భూహక్కు పత్రాలను అందజేస్తున్న ఎంఎల్‌ఎ
రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం
ప్రజాశక్తి-కోవూరు:రైతులకు గట్టి మేలు తలపెట్టాలని అహర్నిశలు కషి చేసే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లభించడం హర్షణీయమని జగన్మోహన్ రెడ్డి రైతు భాందవుడని కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పాటూరు గ్రామంలో భూ హక్కు భూ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ దశాబ్దాలుగా నలుగుతున్న చుక్కల భూముల సమస్య పరిష్కరించి జగన్ రైతుల ముఖంలో సంతోషాన్ని నింపారన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ వ్యవసాయానికి పెద్ద పీట వేశారన్నారు. వ్యవసాయ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఆర్బీకే కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించారన్నారు. చుక్కల భూముల సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జగన్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక దష్టి సారించారన్నారు.కార్యక్రమంలో దొడ్డం రెడ్డి బాబు రెడ్డి, పచ్చిపాల రాధాకష్ణారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, శివుని నరసింహారెడ్డి, ఎంపీపీ పార్వతి, జెడ్‌పిటిసి శ్రీలత, సచివాలయాలకు కవరగిరి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.










