మాట్లాడుతున్న నాబార్డ్ ఏజీఎం రవి సింగ్
రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు..
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:రైతులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నట్లు
నాబార్డ్ ఏజీఎం రవి సింగ్ పేర్కొన్నారు. మండలంలోని కోడూరు కెనరా బ్యాంకులో బుధవారం బ్యాంకు సేవలపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా నాబార్డ్ ఏజీఎం మాట్లాడుతూ రైతులు అవగాహన లోపంతో అధిక వడ్డీలతో నష్టపోతున్నారన్నారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీతో వ్యవసాయ రుణాలు పంపిణీ చేస్తుండడమే కాకుండా, సబ్సిడీపై గోడౌన్లకు రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల లోనుకు 33 శాతం సబ్సిడీతో గోడౌన్ నిర్మాణం కోసం నిధులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. గోడౌన్ల లో ధాన్యాన్ని దాచుకొని అధిక రైతుకు అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. సాంకేతిక యుగంలో పథకాలపై అవగాహన ఉండాలన్నారు. రుణాలను సక్రమంగా చెల్లిస్తే బ్యాంకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. బ్యాంకు మేనేజర్ రవితేజ మాట్లాడుతూ అర్హత కలిగిన వ్యక్తులకు వ్యాపార నిర్వహణకు లోన్లు ఇస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రవిశంకర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు సుకన్య సమద్ధి పథకం ఏడాది నుంచి 14 సంవత్సరం లోపల బాలికలకు వరం లాంటిదని తెలిపారు. ప్రతి ఒక్క రైతు ఈ కేవైసీ చేసుకొని వ్యవసాయ రుణాలు పొందడం ద్వారా ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవచ్చని ఫీల్డ్ ఆఫీసర్ శాంతి కుమారి తెలిపారు. రుణాలు సక్రమంగా చెల్లింపు చేసే వారికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తున్నామని అసిస్టెంట్ మేనేజర్ భరత్ చెప్పారు. కార్యక్రమంలో రీజినల్ ఆఫీస్ సీనియర్ మేనేజర్ చిన్న, హుస్సేనయ్య, కెనరా బ్యాంక్ మేనేజర్ యు.రవితేజ, బ్యాంకు ఖాతాదారులు, రైతులు బ్యాంకు సిబ్బంది, గోల్డ్ అప్రైజర్ చంద్రశేఖర్, క్లర్క్ శిరీష, క్యాషియర్ నరేంద్ర, బ్యాంకు సహాయకులు మస్తానయ్య బ్యాంకు మిత్ర చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










