Mar 23,2022 21:42

మాట్లాడుతున్న జేడి రాజశేఖర్‌


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోంటున్న రైతులు, గ్రామస్థులపై పోలీసులు అక్రమ కేసులు బణాయిస్తున్నారని, కేసులను ఎదుర్కోంటున్న రైతులు, గ్రామస్థులు పోలీసులపై కోర్టులో ప్రయివేటు కేసులు పెట్టడానికి సిద్దమౌతున్నారన్నారు. నియోజికవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యక్తిగత దూషణలకు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రధ్ధ చూపరని చురకలంటించారు. రాబోవు రోజుల్లో వైసిపి పార్టీని ప్రజలే తరమికోట్టే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌, యాచెంద్రనాయుడు, జయరాంరెడ్డి, సురేష్‌నాయుడు, కన్నయ్య పాల్గొన్నారు.