చిత్తూరుఅర్బన్: ఎం.హరినారయణన్ కు కత్ఞతలు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం కు వచ్చిన బాలకష్ణ రెడ్డిని కలెక్టర్ సాదరంగా ఆహ్వానించి వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలను గురించి ప్రస్తావించారు. ఈ సంద్భంగా బాలకష్ణ రెడ్డి మాట్లాడుతూ తాను 1939లో పుట్టానని, ఎమ్మెస్సీ వరకూ చదివానన్నారువ్యవసాయ రంగంలో నూతన విధానాలతో పాటు, ఉద్యానవన పంటలకు చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం ఆనందంగా వుందని వై యస్ ఆర్ అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపికైన చిత్తూరుకు చెందిన కట్టమంచి బాలకష్ణ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తనకు అవార్డు ప్రకటించడం తో జిల్లా కలెక్టర్ . పలు పత్రికల్లో పనిచేశానని, సాహిత్యరంగంతో పాటు, వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడానికి ఎంతో కృషి చేశానన్నారు. తొలకరి పత్రికలో వివిధ రకాల కథలు రాస్తూ మామిడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంతగానో కషి చేశానన్నారు. మరోవైపు జిల్లాలో కోళ్ల పరిశ్రమ అభివద్ధి చెందేందుకు ఎంతగానో కషి చేసినట్టు తెలిపారు. మామిడి రంగానికి అందించిన సేవలతో నేడు జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మామిడి పళ్ళు సీజన్లో చిత్తూరు జిల్లా రావడం జరుగుతుందనీ తెలిపారు. మామిడి రైతులకు ఇంకా విలువైన సమాచారంతో సేవలు అందించాలని భావిస్తున్నట్లు యూరోపియన్ దేశాలు సైతం మన మామిడిని కొనుగోలు చేసేలా ముఖ్యమంత్రిని కోరడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా బాలకష్ణారెడ్డి రచించిన రచనలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆయన కుమారుడు గోవర్ధన్ బాబి జిల్లా కలెక్టర్ కు కతజ్ఞతలు తెలిపారు.










