Oct 29,2022 21:29

రైతులకు డ్రిప్‌ పరికరాలు పంపిణీ
ప్రజాశక్తి- రామకుప్పం:
మండల పరిధిలోని బందాలపల్లి పంచాయతీ గిడ్డపల్లి గ్రామాంలో రాయితీ ద్వారా డ్రిప్‌ పరికరాలను రైతులకు హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ప్రియ, రైతు భరోసా కేంద్రం అధికారి జయంతి పంపిణీ చేశారు. డ్రిప్‌ పరికరాలు కావాల్సిన రైతులు గ్రామపరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో తమ పొలం పాసుబుక్‌, ఆధార్‌ కార్డు, సర్వీస్‌ బోర్‌, రేషన్‌ కార్డు, ఒక పాస్‌ పోర్ట్‌ పోటో, పోన్‌ నెంబర్‌తో రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న పదిరోజులకే డ్రిప్‌ పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. కావలసిన రైతులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు చంద్రప్ప, గుర్రప్ప, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.