Mar 02,2022 21:21

సమావేశంలో మాట్లాడుతున్న డిడిఏ శివకుమార్‌


ప్రజాశక్తి-పీలేరు:

బుధవారం స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిడిఏ మాట్లాడుతూ జిల్లాలో 24,400 మెట్రిక్‌ టన్నుల యురియా, డిఏపి, ఎండిపి, కాంప్లెక్స్‌, ఎస్‌ఎస్‌పిలతో పాటు ఇతర రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలకు 13,400 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేశామన్నారు. అలాగే 10,100 మెట్రిక్‌ టన్నులు రైతులకు పంపిణీ చేశామని, మిగిలిన 3,300 మెట్రిక్‌ టన్నుల ఎరువులను నిల్వచేసి ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ నవీన్‌కుమార్‌, క్వాలిటీ కంట్రోల్‌ వ్యవసాయ అధికారి ప్రవీణ్‌, సహాయ వ్యవసాయ సంచాలకులు మజీద్‌ అహమద్‌, పీలేరు మండల వ్యవసాయ అధికారి కళ్యాణ్‌ బాబు, సాంకేతిక అధికారి కరుణాకర్‌ రెడ్డి, హబ్‌ ఏఈఓ ఇంద్రసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.