కళ్యాణదుర్గం : రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం అండుగా నిలుస్తోందని, అందులో భాగంగా సబ్సిడీ వేరుశన విత్తనాలను ఆర్‌బికెల ద్వారా అందిస్తున్నట్లు మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ సాగు చేసేందుకు అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తన కాయలు అందజేస్తోందన్నారు. విత్తన నాణ్యతలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొందన్నారు. విత్తన పంపిణీలో కానీ, నాణ్యతలో కానీ సమస్యలు తలెత్తితో వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. మంత్రి వెంట అధికారులు, మండల వైసీపీ నాయకులు ఉన్నారు.
మొదటి రోజు 3,113 క్వింటాళ్లు పంపిణీ
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం అందించే విత్తన పంపిణీని మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 3459 మంది రైతులకు 3,113 క్వింటాలు పంపిణీ జరిగింది. అనంతపురం అర్బన్ నియెజకవర్గం పరిధిలోని నారాయణ పురం ఆర్‌బికెలో జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.చంద్రానాయక్‌లు విత్తక కాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో అనంతపురం రూరల్ మండల వ్యవసాయ అధికారి పి.వెంకటేశ్వర ప్రసాద్, జడ్పీటీసీ చంద్రకుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రసాద్, మురళి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, పంచాయతీ కార్యదర్శి అశోక్, మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు రామసుబ్బారెడ్డి, మాజీ సర్పంచి ఉమ్మడి జగన్మోహన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










