ప్రజాశక్తి-శింగనమల మండల పరిధిలో పిఎం కిసాన్‌కు పెండింగ్‌లో ఉన్న రైతుల ఇకెవైసి పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ గుత్తి ఎడిఎ వెంకటరాముడు, ఎఒ అన్వేష్‌కుమార్ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాల సిబ్బందికి ఇకెవైసిపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పెండింగ్ ఉన్న పిఎం కిసాన్ ఇకెవైసి పూర్తి చేయాలని సూచించారు. లేకపోతే రైతులకు డబ్బులు జమ కావన్నారు. అలాగే ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో కౌలు రైతులకు అవగాహన కల్పించి కౌలు రైతుల కార్డులు మంజూరు చేయాలని కోరారు. తద్వారా కౌలు రైతులకు కూడా రైతు భరోసా వస్తుందన్నారు. కాగా మట్టి నమూనా పరీక్షలకు సంబంధించి అవగాహన కల్పించారు. తర్వాత మండలంలోని చక్రాయపేటలో ఉన్న స్వర్ణభూమి ఎరువుల తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించి, స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఇఒ అక్కమ్మ, వ్యవసాయ సిబ్బంది ఉమాదేవి, ఆది, జయలక్ష్మి, రాజేశ్వరి, నవీన్, పవన్, తదితరులు పాల్గొనారు.
సిబ్బందితో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ గుత్తి ఎడిఎ వెంకటరాముడు










