Oct 17,2022 22:43

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం
లాభసాటి వ్యవసాయం దిశగా చర్యలు
అర్హతే ప్రామాణికంగా పథకాల లబ్ధి
ప్రజాశక్తి- సోమల:

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు పథకాలను అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర అటవీ, విద్యుత్‌ సాంకేతిక, పర్యావరణ భూగర్భ గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా అమలు చేస్తున్న వైయస్సార్‌ రైతు భరోసా పిఎం కిసాన్‌ పథకం కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండో విడత లబ్ధిని రైతులకు చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మట్లాడుతూ... అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి పంట వేసుకోవడానికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుందనన్నారు. వైయస్సార్‌ రైతుభరోసా- పిఎం కిసాన్‌ కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండోవిడత కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నదన్నారు. రెండో విడతగా 2,23,092 మంది సాగుదారు రైతు కుటుంబాలకు రూ.44.762కోట్ల ఆర్థికసాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఏమీ లేవని భావించిన ముఖ్యమంత్రి హంద్రీ నీవా కాలువను వెడల్పు చేయడంతో పాటు గండికోట రిజర్వాయర్‌ నుండి రూ.4వేలకోట్లతో యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించి ఎన్నికలలోపు పూర్తిచేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సుగాలిమిట్ట వద్ద ఒక రిజర్వాయర్‌, ఆవులపల్లి రిజర్వాయర్‌ వద్ద భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈరిజర్వాయర్‌ పూర్తిచేసిన తరువాత పుంగనూరు నియోజకవర్గంతో పాటు పీలేరు నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదష్టితో ఈ ప్రాజెక్ట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. భారతదేశం ఎక్కడ లేనివిధంగా రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి రైతులకు అవసరమైన అన్నీ సేవలు అందించడం జరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్‌ యం.హరి నారాయణన్‌ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్‌ సబ్సిడీ, పగటి పుట విద్యుత్తు, సబ్సిడీతో డ్రిప్‌, విత్తనాల పంపిణీ ఇలా ఎన్నో పధకాలను ప్రభుత్వం అమలు చేయడం జరుగుతున్నదని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు, రైతు సోదరుల మధ్య రైతు భరోసా ఉత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందించ దగ్గ విషయమని కొనియాడారు. ఈకార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌, ఎంపి ఎన్‌.రెడ్డప్ప, రాష్ట్రపాల ఏకిరి కార్పొరేషన్‌, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌, రాష్ట్ర జానపద కళల అభివద్ధి కార్పొరేషన్‌ చైర్మన్లు మురళీధర్‌, బుల్లెట్‌ సురేష్‌, కొండ వీటి నాగభూషణం, డిసిసిబి ఛైర్‌పర్సన్‌ రెడ్డమ్మ, రైతులు, అధికారులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి
మంత్రి రోజా
నగరి: వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతు బాంధవుడిగా.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి రైతులు అడిగినవే కాకుండా అడగనవి సైతం మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. సోమవారం నగరి మార్కెట్‌ యార్డ్‌లో రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా రెండో విడత పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి కుటుంబానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే రైతులకు అండగా నిలిచారన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ధర్నాలు చేసింది లేదని.. అడగకుండానే అన్నం పెట్టే అమ్మ మనసున్న జగనన్న ముఖ్యమంత్రిగా ఉండటం అందరి అదష్టమన్నారు. నాలుగు సంవత్సరాలలో రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.25,971కోట్లు రైతులకు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వైసిపి మండలాధ్యక్షురాలు భార్గవి, వైస్‌ ఎంపీపీ కన్నెప్పన్‌, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.