Jun 07,2022 22:38

ప్రారంభ సభలో మాట్లాడుతున్న డిప్యూటి సిఎం నారాయణస్వామి

171 రైతుసంఘాలకు ట్రాక్టర్ల పంపిణీ
డిప్యూటీ సిఎం నారాయణస్వామి
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

రైౖతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కె.నారాయణస్వామి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరులో వై ఎస్‌ ఆర్‌ యంత్ర సేవా పథకాన్ని రాష్ట్రస్థాయిలో ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో పివికెఎన్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహి రంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నె ముక అని, రైతు సంక్షే మం నిమిత్తం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంకల్ప పాదయాత్ర లో రైతుల కష్టాలను తెలుసుకొన్న ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో లో తెలిపిన అంశా లన్నింటినీ నవ రత్నాలుగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమంలో భాగంగా గత మూడు సంవత్సరాలలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 2,38,481 మంది రైతులకు 626.38 కోట్లు, పీఎం కిసాన్‌ కింద 2,16,248 మంది రైతులకు రూ.366.588 కోట్లు, నవంబర్‌ 2021 సం వత్సరంలో కురిసిన అధిక వర్షాల కార ణంగా ఈ సంవ త్సరం ఇన్‌ ఫుట్‌ సబ్సిడీ కింద 36,295 మంది రైతులకు రూ.1,729 లక్షలు అందివ్వడం జరిగిందన్నారు. ఈ సంవ త్సరం విత్తన పంపిణీ లో భాగంగా 73, 234 మంది రైతుల కు 28,976 క్వింటా లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపా రు.. వైయస్సార్‌ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 171 ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరుగు తున్నదనన్నారు.చిత్తూరు పార్ల మెంటు సభ్యులు ఎన్‌.రెడ్డప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు బాంధ వుడు అని, పగటి పూట రైతులకు 9 గంటల ఉచిత విద్యు త్‌ అందించడం జరు గుతున్నదని, సబ్సి డీ తో విత్తనాలు, ఎరువులు అంది స్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌, డి ఆర్‌ ఓ రాజశేఖర్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయ రెడ్డి, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్‌ అముద, చిత్తూరు ఆర్డీఓ రేణుక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీధర్‌, జడ్పీ సీఈఓ ప్రభా కర్‌ రెడ్డి, ఉద్యాన వన శాఖ డిడి శ్రీని వాసులు, మార్కె టింగ్‌ శాఖ ఏడి ఇందుమతి పాల్గొన్నారు.