బుక్కరాయసముద్రం : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మండల పరిధిలోని పసులూరుకు చెందిన రైతు తలారి శివయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకంటామని తహశీల్దార్ మోహన్‌కుమార్ భరోసా ఇచ్చారు. ఈమేరకు శుక్రవారం పసులూరుకు చేరుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈమేరకు భార్య లక్ష్మి, పిల్లలను కలుసుకుని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఐసిడిఎస్ అధికారులతో చర్చించి పాఠశాల వదిలేసిన పెద్దమ్మాయిని హాస్టల్‌లో ఉంచి చదివిస్తామన్నారు. మిగిలిన ముగ్గురు పిల్లలను హాస్టల్ వసతి ఉన్న పాఠశాలల్లో చేర్పిస్తామన్నారు. పరామర్శించిన వారిలో మండల వ్యవసాయ అధికారి శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచి కల్పనా చిన్నపరెడ్డి, కార్యదర్శి రవికుమార్‌రెడ్డి, విఆర్‌ఒ శిల్ప, మహిళా పోలీస్ రాజకుమారి, ఆశావర్కర్ సుహాసిని, ఉద్యాన సహాయకుడు మునికుమార్ పాల్గొన్నారు.
రైతు శివయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న తహశీల్దార్ మోహన్‌కుమార్










