Mar 22,2022 23:42

రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు పంపిణీ



ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌:
మంగళవారం సాయంత్రం వ్యవసాయ సలహా మండలి సమావేశం ఛైర్మన్‌ పాలకూరు రామచంద్రారెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సంధర్భంగా ఇంచార్జ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఆర్‌బికెలు రైతులలో భరోసా కల్పించే విధంగా ఉండాలని, రైతులకు కావల్సిన సలహాలను అందించాలన్నారు. వ్యవసాయ అధికారులు బ్యాంకర్లతో సున్నా వడ్డీ పధకం ద్వారా రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు. వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ మాట్లాడుతూ మామిడి ఉత్పత్తులు ఈ ఏడాది తగ్గనున్నాయని, పరిశ్రమల వారు మద్దతు ధరను ముందుగానే ప్రకటిస్తే మంచిదని, టేబుల్‌ వ్యరైటీస్‌ మామిడి రకాలను ఎగుమతి అయ్యేలా చూస్తే రైతులకు మంచి గిట్టు బాటు కల్పించవచ్చన్నారు. టమోటా ఉత్పత్తులకు గిట్టు బాటు ధర కల్పించేలా ప్రభుత్వానికి ప్రతి పాధానలను పంపాలన్నారు. జిల్లాలో 944 ఆర్‌బికెల పరిధిలో 273 కస్టమర్‌ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి చంద్రశేఖర్‌, ఎపిడి రామాంజునేయులురెడ్డి, ఉద్యానవన శాఖ డిడి శ్రీనివాసులు, జెడి పశుసంవర్ధకశాఖ వెంకటరావ్‌, ఎపిసీడ్స్‌ ఆగ్రోస్‌, సిరికల్చర్‌ అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.