Sep 19,2023 21:53

వాసు

* ఏకగ్రీవంగా అసోసియేషన్‌ ఎన్నిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షునిగా ఆర్‌.వి.ఎస్‌ వెంకటేశ్వరరావు (వాసు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గార మండలం అంపోలు రైస్‌మిల్లర్స్‌ భవనంలో మంగళవారం నిర్వహించిన అసోసియేషన్‌ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కె.వి గోపాల్‌, కోశాధికారిగా తాళాసు కృష్ణారావు, ఉప కోశాధికారిగా పాగోటి రాములు, పిఆర్‌ఒగా లాడి రమేష్‌ ఎన్నికయ్యారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ముద్దాడ సూర్యనారాయణ, అంధవరపు ధనుంజరు, శాసనపురి కుమారస్వామి, కర్రి రాంబాబు, టంకాల అర్జున్‌బాబు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా కోరాడ శంకర్రావు, పిరియా విజరు కుమార్‌ను ఎన్నుకున్నారు. ఎన్నికలకు అసోసియేషన్‌ శాశ్వత గౌరవాధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌, కింజరాపు ప్రసాద్‌ పరిశీలకులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్‌ శాశ్వత అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అభినందించారు. రైస్‌ మిల్లర్ల అభ్యున్నతికి, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం మంచి సేవలు అందించాలని కోరారు. రానున్న రెండు నెలల్లో నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా అధ్యక్షునిగా వాసు హ్యాట్రిక్‌ విజయం సాధించడంపై అందరూ అభినందనలతో ముంచెత్తారు. జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌కు ఐదోసారి అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారు. రాష్ట్ర అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగానూ పనిచేస్తున్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, బగ్గు లక్ష్మణరావు, తంగుడు నాగేశ్వరరావు, జోగిశెట్టి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా నలమూరు నుంచి అధిక సంఖ్యలో మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.