Mar 02,2023 17:18

ముందస్తు సమాచారం లేక ప్రయాణికుల అవస్థలు

ప్రజాశక్తి - పాలకోడేరు

ఇటీవల భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని పలు రైల్వే గేట్ల వద్ద ట్రాక్‌ల మరమ్మతు పనులు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారులు ట్రాక్‌ మరమ్మతులు చేసిన సమయంలో గేటు మూసేయడంతో ముందస్తు సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మోగల్లు - వేండ్ర గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌ మరమ్మతు పనులు బుధవారం ప్రారంభించిన నేపథ్యంలో అప్పటి నుంచి గేటు మూసేశారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు వెనుతిరగాల్సి వచ్చింది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకూ ట్రాక్‌ మరమ్మతుల నిమిత్తం గేటు మూసివేయనున్నట్లు ఆ ప్రాంతంలో అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది తప్పడంలేదు.