Jul 28,2023 21:45

రైల్వే డిఆర్‌ఎం వినతిపత్రం సమర్పిస్తున్న సిఐటియు నాయకులు

           ప్రజాశక్తి-గుంతకల్లు   రైల్వే కాంటాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కసాపురం రమేష్‌, సాకే నాగరాజు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం పట్టణంలోని కార్యాలయంలో డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ మనీష్‌ అగర్వాల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగాల్లో కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. అయితే గుత్తేదారులు వారి శ్రమకు తగిన వేతనాలు ఇవ్వడం లేదన్నారు. టెండర్‌ అగ్రిమెంట్‌లో కాంట్రాక్టర్స్‌ మారినా కార్మికులను తొలగించవద్దన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు కనీసం వేతనం రూ.26వేలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు షబ్బీర్‌, మల్లి, కార్మిక నాయకులు పెద్దన్న, మురళి, ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.