Jul 18,2023 19:27

దారిచ్చి మానవత్వం చాటిన స్థానికులు
ప్రజాశక్తి - అత్తిలి
సంజీవని వాహనం (అంబులెన్స్‌) రైల్వే గేటు పడడంతో ట్రాఫిక్‌లో చిక్కు కుపోయింది. అంబు లెన్స్‌లో ఉన్న రోగి గుండెపోటుతో ఇబ్బంది పడడం చూసి చలించిన స్థానికులంతా వాహనాన్ని దారిమళ్లించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం 12 గంటల సమయంలో వరిఘేడులో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో తణుకు చెందిన సంజీవని వాహనంలో భీమవరం ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే ఆ సమయంలో రైల్వే గేటు పడింది. రోగి బాధను చూసి చలించిన స్థానికులంతా వాహనానికి అడ్డుతొలగి వేరే దారిగుండా వాహనాన్ని మళ్లించి మానవత్వం చాటుకున్నారు.