ప్రజాశక్తి-రాయదుర్గం రాయలసీమను సర్వనాశనం చేసిన సిఎం జగన్‌కు సీమలో సభ పెట్టే అర్హత లేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. సిఎం జగన్ కళ్యాణదుర్గం పర్య టన సందర్భంగా భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాల తరలింపు, గుంతకల్లు రిజర్వాయర్ నిర్మాణంపై నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శనివారం రాయదుర్గం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వినాయక కూడలి వరకూ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేయాలని టిడిపి నాయకులు నిర్ణయించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అడ్డుకు న్నారు. అయినా కాలవ శ్రీనివాసులు తన నివాసం నుంచి పోలీసు ల కన్నుగప్పి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయ ం నుంచి కాలవ బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అయితే కాలవ శ్రీనివాసులును పోలీసులు అ దుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంత రం మీడియాతో కాలవ మాట్లాడుతూ సాగునీటి పథకాల పనులను నాలుగేళ్లుగా పూర్తిగా నిలిపివేసి రాయలసీమ భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్న సిఎం జగన్ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీకి పిలుపునిస్తే పోలీసులతో కార్యక్రమాన్ని అడ్డుకోవడం బాధాకరమనానరు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు రోడ్డుపై తాము నడిస్తే ఎవరికైనా నష్టమా.. ప్రజా సమస్యలు వినిపిస్తే ఎవరికి బాధ.. అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ దుర్భిక్షానికి కేటాయించిన రూ.32 వేల కోట్ల పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పదివేల ఎకరాలకు విస్తరిస్తామని జగన్ హామీ ఏమైందన్నారు. జీడిపల్లి నుంచి బీటీ ప్రాజెక్టుకు కృష్ణాజలాల ఎత్తిపోతల పథకం, పేరూరు పథకం, ఉరవకొండ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల బిందు సేద్యం పథకం, తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు ఏమయ్యాయన్నారు. తీరని ద్రోహం చేసిన జగన్‌కు రాయలసీమలో పర్యటించే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు పర్వీన్‌తాజ్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సాలార్‌బాషా, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు హనుమంతురెడ్డి, మహబూబ్‌బాషా, కాలవ సన్నన్న, బండి భారతి, మున్సిపల్ వార్డు సభ్యులు ప్రశాంతి, జ్యోతి, హనుమంతు మోహన్‌రెడ్డి, కేశవరెడ్డి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి నాయకులు










