Jun 01,2023 10:09

రాయదుర్గం పట్టణంలో రోడ్లపై నిలిచి వర్షం నీరు

        రాయదుర్గం రూరల్‌ : రాయదుర్గం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడింది. పెద్దపెద్ద శబ్ధాలతో ఉరుములు ఉరిమాయి. వర్షం దెబ్బకు పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన కొలిమి వీధి, మధు టాకీస్‌ ఏరియాలు జలమయం అయ్యాయి. డ్రైయినేజీల్లో పూడిక తీయకపోవడం వల్ల వర్షం నీటికి మురుగు నీరు తోడై లోతట్టు ప్రాంతాల్లోకి చేరాయి. లక్ష్మీబజార్‌ ప్రధాన రోడ్డుపై నీరు పారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. విపరీతమైన ఈదురు గాలులు వీచడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం మండల పరిధిలోని రాయంపల్లి గ్రామంలో నాగరాజు అనే వ్యక్తికి సంబంధించిన కోళ్ల ఫారం షెడ్డు రేకులు గాలికి ఎగిరి పోయాయి. 50 కోళ్లు మతి చెందినట్లు బాధితుడు తెలిపాడు. రెండు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు చెప్పాడు.