Aug 16,2023 21:32

రాత్రికి రాత్రే చెట్టు మాయం
ప్రజాశక్తి- శాంతిపురం:
రాళ్ళబూదుగూరు జూనియర్‌ కళాశాల పక్కన కొందరు ప్రైవేటు వ్యక్తులు లేవుట్‌ వేయడానికి రోడ్డు పక్కన దశాబ్దాలుగా ఉన్న పెద్ద కర్పూరం చెట్లను రాత్రికిరాత్రే ట్రాక్టర్లు జేసిబిలతో నరికి తొలగించారు. అసలు అక్కడ ఏ చేట్లు ఉన్నట్లుగా కనీసం ఆనవాలు కూడా లేకుండా భూమిని చదును చేశారు. ఇంత బహిరంగంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసంచేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం వీటిపై దష్టి సాధించకపోవడం కొసమెరుపు. ఈవ్యవహారం మొత్తం నాయకులు అధికారుల అండదండలతోనే జరుగుతోందని పట్టణ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. చెరువుల నుంచి భారీగా మట్టిని ట్రాక్టర్లలతో తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం శోచనీయం.