ప్రజాశక్తి - పెనుమంట్ర
ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో జరిగే ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల రాష్ట్రస్థాయి అండర్ 14కు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్రి కృష్ణారెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారుడు సత్తి సుబ్బన్నరెడ్డి తెలిపారు. ఆదివారం మార్టేరు ఎస్‌విజిహెచ్ గ్రౌండ్ ఆవరణలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. చింతకాయల సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), గవ్వ శ్రీనివాస్ (ఏలూరు), కర్రి వినాయక రెడ్డి (మార్టేరు) ఎంపిక కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. ఆయా మండలాల నుంచి పి.సాయిసత్యవంశీ, చార్లెస్ వెస్లీ (కొవ్వలి), ఎస్‌ఎస్‌సి సాయిమణికంఠ (తాడేపల్లిగూడెం), పి.రాఘవేంద్రరెడ్డి, ఎం.రామతేజ (మార్టేరు), అఖిల్ (ఏలూరు), శంకర్ రెడ్డి (మార్టేరు), ఎం.ఇనోష్ (కవ్వాలి), జె.వేదాంత్ (తాడేపల్లిగూడెం), బి.సాయి మణికంఠ (దేవరపల్లి), కె.సందీప్ (ఏలూరు), పి.కిరణ్‌కుమార్ (మార్టేరు) ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌విజిహెచ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సిఎస్‌ఎన్.రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుల జిల్లా కార్యదర్శి మహమ్మద్ హుద్దూన్ పాల్గొన్నారు.










